'సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్'ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

by Harish |   ( Updated:2021-10-06 10:22:53.0  )
apollo-hospital
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అపోలో హాస్పిటల్స్ ఆసియాలోనే మొట్టమొదటి సమగ్ర వైద్య సంరక్షణ సేవలైన అపోలో ఎక్సలెన్స్ ఇన్ క్రిటికల్ కేర్(ఏసీఈసీసీ)ని బుధవారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్ ప్రస్తుతం భారత్‌లోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ ప్రొవైడర్‌గా ఉంది. 25 శాతానికి పైగా ఇన్‌పేషెంట్ బెడ్ సామర్థ్యాన్ని ప్రత్యేకంగా క్రిటికల్ కేర్(ఇంటెన్సివ్ కేర్) కోసం కేటాయించినట్టు తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వివిధ వైద్య అవసరాల్లో పరిస్థితి ప్రాణాంతకం కాకుండా ఈ విభాగం ద్వారా చికిత్స అందించనున్నట్టు సంస్థ పేర్కొంది. ఏసీఈసీసీలను అపోలో హాస్పిటల్ నెట్‌వర్క్‌లోనే కాకుండా భారత్ సహా విదేశాల్లోని అపోలోయేతర యూనిట్లతో భాగస్వామ్యం ద్వారా సమగ్ర సేవలందించనున్నట్టు వివరించింది. దీనికోసం పెద్ద ఎత్తున డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తీవ్రమైన అనారోగ్యం కారణంగా ప్రతి ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇలాంటి మరణాలను నివారించేందుకు సమన్వయంతో సకాలంలో వైద్యం అందించేందుకు క్రిటికల్ కేర్ విభాగం ఉపయోగపడుతుంది. ఇది తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన క్రిటికల్ కేర్ సేవలందుతాయి. ఈ సేవలను కేవలం అపోలో హాస్పిటల్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా భారత్‌తో పాటు విదేశాల్లోనూ భాగస్వామ్యం ద్వారా, రోగులు, వైద్యులు, నర్సింగ్ హోమ్, హాస్పిటల్స్ వారితో కొనసాగనున్నామని’ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు.

Advertisement

Next Story