కశ్మీర్‌‌లో ఉగ్రవాదుల కాల్పులు.. అప్నీ పార్టీ కీలక నేత మృతి

by Sumithra |
terrorist attack
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అప్నీ పార్టీ నేత హసన్ మృతిచెందాడు. కుల్గాం జిల్లా దేవ్‌‌సర్‌లోని హసన్ నివాసం వద్ద గురువారం రాత్రి ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రగాయాల పాలైన హసన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తు్న్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఘటనను గమనించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాగా, అదే జిల్లాలో బీజేపీ నాయకుడు జవీద్ అహ్మద్ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండ్రోజులకే ఈ దాడి జరుగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed