- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? వైసీపీ ప్రభుత్వంపై సాకే శైలజనాథ్ ఫైర్
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటోందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి ఏదని నిలదీశారు. దళితులపై దాడులు పెరిగాయని.. అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారని శైలజానాథ్ ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనా.. నేతల ఇళ్లపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై విధ్వంసానికి దిగడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆంధ్రరత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న వారు ఏం చేసినా సాగుతుందన్న మొండి వైఖరి విడనాడాలని సూచించారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ కూడా లేకపోవడం దారుణమన్నారు.
అధికార పార్టీ నాయకులు (ఎమ్యెల్యే, మంత్రులు) తమ భాష, వ్యవహార శైలి అదుపులోపెట్టించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందని ఆయన సూచించారు. జరిగిన దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సమీక్షించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.