- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముదిరిన వాటర్ వార్.. పులిచింతల వద్ద రాకపోకలు నిలిపివేత
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదాల నేపథ్యంలో పులిచింతల వద్ద ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 23 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి పులిచింతలకు 36 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది ఇక శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాలు భద్రత పెంచాయి. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం కుడిగట్టు వద్ద ఏపీ స్పెషల్ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. ఉద్యోగులను మినహా పవర్‌హౌస్‌లోకి ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. అటు నాగార్జున సాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం పోలీసులను మోహరించింది. సాగర్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.