- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో మద్యం ధరలకు రెక్కలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నిషేధంపై పట్టుదలగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు 45 రోజులుగా నిలిపేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సడలింపుల నేపథ్యంలో రేపటి నుంచి ఏపీలో మద్యం షాపులను తెరువనున్నారు. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే ఏపీలో బెల్టు షాపులను నియంత్రించిన ప్రభుత్వం, వలంటీర్ల సాయంతో మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేసింది. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే మద్యం షాపులను నడిపే ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే మద్యం ఉత్పత్తికి 14 డిస్టెల్లరీస్‌కి అనుమతిచ్చింది. అయితే ధరలు అందుబాటులో లేకుంటే మద్యాన్ని నియంత్రించవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి మద్యం దుకాణాలను తెరువనున్నామన్న శుభవార్త చెబుతూనే… మద్యం ధరలను 25 శాతం పెంచుతోంది. పెంచిన ధరలను రేపటి నుంచే అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
tags: lockdown, liquor shops, liquor business, ap, liquor rates