రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయింది: అచ్చెన్నాయుడు

by srinivas |   ( Updated:2021-12-04 00:21:24.0  )
Roshaiah-3
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రోశయ్య మృతి పట్ల అచ్చెన్నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‍ఆయన మృతితో రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయిందని, రోశయ్య ఏ పదవి చేపట్టినా ప్రజాసేవే పరమావధిగా పనిచేశారన్నారు. ‎ముఖ్యమంత్రిగా, ఆర్ధికమంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. రోశయ్య అన్ని పార్టీల నాయకులతోనూ ఎలాంటి విభేదాలకు తావులేకుండా స్నేహపూర్వకంగా మెలిగేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు

రోశయ్య లేని లోటు తీర్చలేనిది : మంత్రి కొప్పుల ఈశ్వర్.

Advertisement

Next Story