- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కండక్టర్ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఆర్టీసీ ఎండీ తిరుమల రావు
X
దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా రాజంపేటలో శుక్రవారం వరదలో ఆర్టీసీ బస్సు నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కడప జిల్లాలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కడప బస్టాండ్, గ్యారేజ్‌ను పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
Advertisement
- Tags
- floods
Next Story