‘టీడీపీకి దగ్గరవ్వాలనే బీజేపీని దూరం’

by srinivas |   ( Updated:2021-03-15 01:39:36.0  )
‘టీడీపీకి దగ్గరవ్వాలనే బీజేపీని దూరం’
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జన సైనికుల విన్నపం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతు ప్రకటిస్తున్నామని పవన్ చెప్పారు. అయితే పవన్ చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపింది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకీ దగ్గరయ్యేందుకే పవన్ కల్యాణ్ బీజేపీనీ దూరం పెట్టారని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో జనసేనకు ఎలాంటి బలం లేదన్నారు. తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారశైలి పై నిన్న పవన్ కల్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకే పవన్ కల్యాన్ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడన్నారు.

Advertisement

Next Story