- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాం : ఆళ్ల నాని
దిశ, అమరావతి బ్యూరో: క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న కరోనా రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు. విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రిని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కరోనా బాధితులకు కల్పించే సదుపాయాలు, మందుల పంపిణీ అంశంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మైల్డ్ కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని జిల్లాల్లో 4 వేల బెడ్లు సిద్ధం చేసి ఉంచామని పేర్కొన్నారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మీకు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని కోరాలరు.