- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై పోరాటానికి ఏపీ ఐపీఎస్‌ల విరాళం
గత రెండు రోజులుగా కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ను కమ్ముకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పెద్ద పోరాటమే చేస్తోంది. ఇప్పటికే రెండు పాత జీవోల బూజు దులిపి వెలికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల సేవల్ని కూడా వినియోగించుకునే పనిలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దగ్గర్నుంచి గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు సాయమందించేందుకు ముందుకు వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లోని సభ్యులు తమ మూడు రోజుల వేతనాన్ని కోవిడ్-19 సహాయచర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేస్తూ, సంబంధిత పత్రాన్ని ఆయనకు అందజేశారు.
Tags: ips officers, cm relief fund, ys jagan, goutam sawang, andhrapradesh