AP News: ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ, వాటిని తిరిగి పిలవాలని ఆదేశాలు

by srinivas |   ( Updated:2021-09-04 08:22:47.0  )
ap-high-court,
X

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలోని దుర్గగుడి టెండ‌ర్లలో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. శానిటేష‌న్‌, హౌస్ కీపింగ్ కోసం దుర్గగుడి అధికారులు టెండ‌ర్లను ఆహ్వానించారు. టెక్నిక‌ల్ బిడ్‌లో అర్హత సాధించ‌లేద‌ని లా మెక్లయిన్ ఇండియా సంస్థను అధికారులు టెండర్‌లో పాల్గొనే అవకాశం కల్పించలేదు. దీంతో లా మెక్లయిన్ ఇండియా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో దుర్గగుడి అధికారులు వెంటనే టెండర్లను రద్దు చేశారు.

ఈ అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పాత కాంట్రాక్టర్‌ను కొన‌సాగించేందుకు రెండేళ్ల నుంచి టెండ‌ర్లు పిల‌వ‌కుండా జాప్యం చేస్తున్నార‌ని న్యాయ‌వాది ముప్పుటూరి వేణుగోపాల‌రావు వాదించారు. ఎప్పటిక‌ప్పుడు టెండ‌ర్లను పిలవ‌కుండా జాప్యం చేస్తున్నార‌ని వాదించారు. ఇప్పటికైనా పాత కాంట్రాక్టును ర‌ద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో హైకోర్టు ర‌ద్దు చేసిన టెండ‌ర్లను రీ ఓపెన్ చేయాల‌ని తీర్పునిచ్చింది. లా మెక్లయిన్ ఇండియా సంస్థను టెండ‌ర్లలో పాల్గొనే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed