సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే

by srinivas |
సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ విషయంలో సీఐడీ నిర్వహిస్తున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేవరకు ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. రమేశ్ కుమార్ లేఖ రాయలేదని, ఇతరులు తయారు చేసిన లేఖను ఆయన పంపారని వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన పలువురు ఉద్యోగులను సీఐడీ విచారించింది. ఎన్నికల కమిషన్ తరపున సీతారామమూర్తి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

Next Story