- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు..
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టులో బుధవారం అసైన్డ్ భూముల పిటిషన్లపై విచారణ జరిగింది. నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను వెనక్కి తీసుకుంటామంటూ జగన్ సర్కార్ ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అసైన్డ్ రైతులకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి.. రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటామని మరో జీవో విడుదల చేయడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశించింది.