ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

by srinivas |
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విషయంలో పోలీసులు తొందరపడొద్దని ఆదేశిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో పోలీసులు తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. ఏబీ వెంకటేశ్వరావు తరపున సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. జనవరి 18లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story