చంద్రబాబుకు అవమానం.. మద్దతుగా హెడ్ కానిస్టేబుల్ రాజీనామా..

by Anukaran |   ( Updated:2021-11-20 06:02:01.0  )
చంద్రబాబుకు అవమానం.. మద్దతుగా హెడ్ కానిస్టేబుల్ రాజీనామా..
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనలు తనను ఎంతో బాధించాయని ప్రకాశం జిల్లా కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి ప్రభుత్వంలో పని చేయడం తనకు ఇష్టం లేదని ప్రకటించారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే డబ్బుతో తన పిల్లలకు అన్నం పెట్టలేనని భావోద్వేగానికి గురయ్యాడు.

చంద్రబాబుకు జరిగిన అవమానం తట్టుకోలేక పోతున్నాని, ఆయన కాలంలోనే నేను ఉద్యోగం తెచ్చుకున్నానని, ఎంతో నిజాయితీగా పనిచేశానని చెప్పుకున్నారు. ఇక ఉద్యోగాన్ని వదులుకుంటున్నాని బెల్ట్ , క్యాప్ తీసి అక్కడి నుంచి వెల్లిపోయారు. కావాలంటే టిఫిన్ సెంటర్ పెట్టుకుని పోషించుకుంటానని అన్నాడు.

అసెంబ్లీ ఘటన: NTR వారసులు మూర్ఖులు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story