అన్ లాక్5 నిబంధనలను నోటిఫై చేసిన సర్కార్….

by srinivas |
అన్ లాక్5 నిబంధనలను నోటిఫై చేసిన సర్కార్….
X

దిశ వెబ్ డెస్క్:
అన్ లాక్ 5 నిబంధనలను నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు అన్ లాక్ 5 నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. 50శాతం సామర్థ్యంతో సినిమా హాల్లు, మల్టీ ఫ్లెక్సులను తెరిచేందుకు అనుమతులను ఇచ్చింది. ఈ నెల 15 తర్వాత పార్కులను తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ దూర విద్యా తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఇక బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో మాస్కుల ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాల దగ్గర భౌతిక దూరం పాటించాలని తెలిపింది. వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై పాండమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మెనేజ్మెంట్ చట్టం కింద చర్యలను తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed