మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : గవర్నర్

by srinivas |
AP Governor
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆంద్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతిసామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ప్రశంసించారు. అంతేగాకుండా మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. జాతి నిర్మాణంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story