ఏఐజీ ఆస్పత్రి నుండి డిచ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్

by Sridhar Babu |
bishwa-bhooshan-1
X

దిశ, శేరిలింగంపల్లి: కోవిడ్ లక్షణాలతో ఈనెల 17న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మంగళవారం డిచ్చార్జ్ అయ్యారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఈనెల 17న ఆస్పత్రికి వచ్చిన గవర్నర్ ను పరీక్షించిన ఏఐజీ ఆస్పత్రి డాక్టర్ల బృందం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు తేల్చారు. అప్పటి నుండి అక్కడే చికిత్స అందించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిని మరోసారి పరీక్షించి కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని ఏఐజీ చైర్మెన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story