ఏపీలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఫ్రీ

by srinivas |
ఏపీలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఫ్రీ
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి కావాల్సిన పరిస్థితి. దీంతో పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 60వేల మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో మిగతా విద్యార్థులకూ ఆన్‌లైన్ విద్యలో ఆటంకాలుండొద్దనే ఉద్దేశంతో రూ.5వేల నుంచి రూ.6వేలు విలువైన స్మార్ట్ ఫోన్లను అందజేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed