ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లి వేడుకలపై ఆంక్షలు

by srinivas |
Bride Refusing to Marry Groom with Bad Eyesight
X

దిశ, ఏపీ బ్యూరో : ఆగస్టు నెల అంటే పెళ్లిళ్ల సీజన్‌. ఈ శ్రావణమాసంలో వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. పెళ్లిళ్లలో భారీ సంఖ్యలో జనాలు గుమిగూడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించింది. బంధువులు, స్థానికులు, కుటుంబ సభ్యులంతా ఒకేచోటకు చేరడంతో కొవిడ్‌ విస్తరణకు దారితీసే అవకాశాలున్నాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

సోమవారం క్యాంప్ కార్యాలయంలో కొవిడ్ నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలని ఆదేశించారు. అలాగే కొవిడ్‌ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed