- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయం!
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ప్రభుత్వం త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టనుందని, మరోవైపు ఖాళీ అయన మంత్రి వర్గాలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ భర్తీ చేయనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ రెండు స్థానాలు ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ ఏపీలోని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వారి సామాజిక వర్గాలకు చెందిన నేతలతోనే జగన్ భర్తీ చేస్తారని కొందరు ఊహిస్తుంటే.. సన్నిహితులతో భర్తీ చేస్తారని ఇంకొందరు భావిస్తున్నారు.
జగన్ సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి వర్గంలో ఛాన్స్ కల్పించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వారిద్దరూ జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారిని కాకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట్రమణ సామాజిక వర్గాలకు చెందిన వారినే తిరిగి వారి పదవుల్లో నియమిస్తారన్న చర్చ రాజీకయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీలోని బోస్, మోపిదేవి వర్గాలకు చెందిన నేతలపై చర్చ జోరుగాసాగుతోంది. దీంతో మరో ఇద్దరిపై చర్చ జరుగుతోంది.
బీసీ వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందితే, మోపిదేవి వెంకట్రమణ మత్స్యకార సామాజికవర్గాలకు చెందిన వ్యక్తి. దీంతో అదే సామాజిక వర్గలకు చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు మంత్రి పదవికి పోటీపడుతున్నారు. అదే వర్గం నుంచి కృష్ణా జిల్లా నుంచి మరొకరు ఆశిస్తున్ననేపథ్యంలో తొలిసారి నెగ్గిన వారికి స్థానం లేదనే నిబంధన పాటిస్తే వేణుకు ఇవ్వకపోవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. రాజకీయంగా ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా ఆయనను మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తోంది.
ఇంకో వైపు మత్స్యకార వర్గం నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మోపిదేవి స్థానాన్ని పొన్నాడతో భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సతీష్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బలమైన మత్స్సకారవర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి పదవి ఖాయమనే ప్రచారం ఉంది.