- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారంటైన్ పూర్తైనా పోలీసులు వదల్లేదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఆందోళన తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదైన కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో క్వారంటైన్ పూర్తి చేసిన ఏపీ వాసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 35 మంది తెలంగాణలో క్వారంటైన్ ముగించుకున్నారు. దీంతో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒక బస్సు వేసి ఏపీకి పంపించింది. వారికి క్వారంటైన్ పూర్తయినట్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దీంతో వారంతా స్వస్థలానికి చేరుకోవచ్చని భావించారు. అయితే కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వర్తిస్తున్న పోలీసులు బస్సు తెలంగాణ నుంచి వస్తున్నట్టు నిర్ధారించుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ బస్సు నిలిచిపోయింది.
వారందరికీ క్వారంటైన్ పూర్తయిందని నిర్ధారించుకున్న తరువాత వారిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఉందని భావించినా వారిని నిర్బంధిస్తోంది.
Tags: coronavirus, covid-19, telangana, ap, krishna district