AP News: సీఎం జగన్ కీలక నిర్ణయం..13 ఏళ్ల పోరాటానికి ఫలితం

by Anukaran |   ( Updated:2021-06-09 06:41:41.0  )
cm ys jagan
X

దిశ, ఏపీ బ్యూరో: డీఎస్సీ 2008 అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. అర్హులందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్సీ-2008 అభ్యర్థులు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు. 13 సంవత్సరాలుగా తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దీంతో స్పందించిన సీఎం జగన్ వారందరినీ మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పంద పద్ధతిలో తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే వీలైనంత త్వరగా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో 2,193 మందికి లబ్ధి చేకూరనుంది. జగన్ నిర్ణయంపట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పదమూడేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed