ఏపీలో 9 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు

by Anukaran |
ఏపీలో 9 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 9 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 9 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. రాత్రి 10 తర్వాత దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది.

అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రాత్రి 10 గంటల వరకు సడలింపు ఉంటుంది. ఇకపోతే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాలో మాత్రం సాయంత్రం 6గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. ఇకపోతే ఈనెల 28న జరిగిన కొవిడ్‌పై సమీక్షా సమావేశంలో 8 జిల్లాల్లో సీఎం జగన్ కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరగడంతో ప్రకాశం జిల్లాలోకూడా కర్ఫ్యూ సడలించారు.

Advertisement

Next Story