- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లే కాదు.. కాలేజీలు కూడా..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరాన్ని ఆగస్టు మూడు నుంచి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా తుది పరీక్షలు నిర్వహించకుండానే విద్యాసంవత్సరాన్ని ముగించారు. మార్చి 22 నుంచి మూతబడిన స్కూళ్లు తిరిగి ఆగస్టు 3న తెరుచుకుంటాయని ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తరువాత స్కూళ్లు తెరుచుకున్న రోజునే కాలేజీలు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
దీంతో ఆగస్టు 3 నుంచి జూనియర్ కాలేజీలు తెరిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరం ఆగస్టు 3న ప్రారంభమవుతుంది. ఏడాదిలో మొత్తం 196 పనిదినాలు ఉంటాయి. సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించనుంది. జూనియర్ కాలేజీలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. ఉదయం కొన్ని గ్రూపులకు మధ్యాహ్నం ఇంకొన్ని గ్రూపులకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించనున్నారు.
ఇక పాఠశాలలు, కాలేజీల్లో ఇంతవరకు ఉండే రెండో శనివారం సెలవును తీసేసి, ఆరోజు కూడా కాలేజీలను నిర్వహించడం ద్వారా సిలబస్ పూర్తి చేయనున్నారు. ఇక వివిధ పండగలకు వారం రోజులు ఇచ్చే సెలవులను రద్దు చేయనున్నారు. ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే సెలవులివ్వనున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు మాత్రమే కాకుండా ఆన్‌లైన్ వీడియోలు రూపొందించడం, టెలికాస్ట్ చేయడం ద్వారా పాఠాలు చెప్పనున్నారు. అలాగే విద్యార్థులకు యూనిట్ పరీక్షలు, ప్రధాన పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని తెలిపింది. ప్రతి సబ్జెక్టుకీ వర్క్ బుక్ ఒకటి ఉండనుంది. జేఈఈ మెయిన్స్ తదితర ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.