- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదోతరగతి విద్యార్థులంతా పాస్ : ఏపీ విద్యాశాఖ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో 2019-20 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ విద్యార్థి పాస్ అయ్యారని ప్రభుత్వం గతంలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఏపీ విద్యాశాఖ జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిందని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదని వెల్లడించింది. ఆఖరుకి 11 పేపర్ల పరీక్షలను 6 పేపర్లకు కుదించామని, ఇందుకోసం ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించామని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున విద్యార్థులు అనారోగ్యానికి గురై బాధపడే ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశ్యంతో పది పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులందరూ పాసైనట్లు ప్రకటించామని విద్యాశాఖ తెలిపింది.