- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాతో ఏపీ డాక్టర్ మృతి… చెన్నైలో రహస్యంగా అంత్యక్రియలు
నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్‌కు కరోనా సోకి చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని అంత్యక్రియలను అధికారులు రహస్యంగా ముగించిన ఘటన వివాదాస్పదమైంది. డీహెచ్ఎంఓగా పని చేసే ఆయనకు బీపీ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన ఆరోగ్యపరిస్థితి పరిస్థితి విషమించి, సోమవారం మృతి చెందారు. దీంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబత్తూరు శ్మశాన వాటికకు తరలించారు.
శ్మశాన వాటికలో ఆయన ఏ కారణంతో మరణించారో చెప్పాలని స్థానికులు ప్రశ్నించడంతో అధికారులు కరోనా కారణంగా అని చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు అంగీకరించలేదు. దీంతో వెనుదిరిగిన అధికారులు తిరిగి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం మరో శ్మశాన వాటికకు తీసుకెళ్లి రహస్యంగా అంత్యక్రియలు ముగించారు. కాగా, ఆయన అంత్యక్రియలను రహస్యంగా ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే, కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో పాటించాల్సిన విధానాలన్నీ పాటించామని అధికారులు తెలిపారు. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే తొలుత అంత్యక్రియలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామని వారు భరోసా ఇచ్చారు. జరిగినది చాలా సున్నితమైన విషయయపకప తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్ అన్నారు. ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ అంత్యక్రియల విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్ గురించి తెలుసని చెప్పారు. వీటిపై గతంలోనే విధివిధానాలు అందించామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన తెలిపారు.
Tags: nellore doctor, corona virus, app, covid-19, doctor dead