అంతర్వేది పై జగన్ కీలక నిర్ణయం…

by  |
అంతర్వేది పై జగన్  కీలక నిర్ణయం…
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్వేది ఘటన ఏపీని కుదిపేస్తోంది. రోజురోజుకూ అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇన్నిరోజులు బీజేపీ, జనసేన, వీహెచ్పీ నాయకులు ఈ ఘటనకు గల కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా, ఆందోళనలు చేపట్టే పార్టీల నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనపై ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థలు భగ్గుమన్నాయి.

అది కాస్త ప్రజాగ్రహంగా మారక ముందే చర్యలు చేపట్టాలని అధికార వైసీపీ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ నాయకులు జగన్ సీఎం అయ్యాక ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచరం. 62 ఏండ్ల చరిత్ర కలిగిన రథం దగ్ధం విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు గల కారకులపై చర్యలకు ఉపక్రమించింది.ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు ఏపీ డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. దీనిపై శుక్రవారం జీవో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్పందించారు. సీబీఐ విచారణ ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. అటు టీటీడీని కాగ్ పరిధిలోని తీసుకురావడంతో పాటు అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరగడం హిందువులంతా హర్షించే విషయమన్నారు.

Next Story

Most Viewed