- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుల, మతాలకు తావులేకుండా అందరికీ ఇళ్లు
దిశ, విశాఖపట్నం: కుల, మతాలకు తావులేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల స్ధలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్మూలో ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో ధర్మాన కృష్ణాదాస్ పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రెవెన్యూ మంత్రిగా తనకు ప్రధాన పాత్ర దక్కినందుకు ఆ దేవుడికి, సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీ రంగనాధ్ మాట్లాడుతూ.. టిడ్కో ఇల్లు వద్దని మహిళలు కోరారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇస్తున్నామని తెలిపారు. తాము ఇస్తున్న భవన మెటీరియల్ బయట కొంటె 3 నుండి 4 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. తాము ఇచ్చిన మెటీరియల్స్ క్వాలిటీతో కూడుకున్నదన్నారు. వాటర్ హీటర్, ఏసీ కూడా ఈ ఇంటిలో పెట్టుకొనే విధంగా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్ నివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.