ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ

by srinivas |
ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా సాకుతో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత.. కరోనా కట్టడికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వంతో సంప్రదించి ఉంటే కరోనాపై వాస్తవ నివేదిక ఇచ్చే వాళ్లమని సీఎస్ అన్నారు. దీంతో ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం స్థానిక ఎన్నికలను నిర్వహించాలని కోరారు. కాగా, స్థానిక ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అనుహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story