సీఎస్ పదవీకాలం పెంపు

by srinivas |
సీఎస్ పదవీకాలం పెంపు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం తరువాత సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినీ నీలం సాహ్నీ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో కరోనా కష్టకాలంలో ఆమె సేవలు మరింత అవసరమని, అందుకే ఆమె పదవీకాలం పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం ఆమోదించండంతో ఆమె పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం నీలం సాహ్నీ జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు.

Advertisement

Next Story