AP Health bulliten : తగ్గిన కేసులు, పెరిగిన మరణాలు

by srinivas |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, మరణాల సంఖ్య మాత్రం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,429 కేసులు వెలుగుచూడగా, 103 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,362 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 10,634 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మృతి చెందగా, విశాఖలో 10, నెల్లూరులో 9, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో 8 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Advertisement

Next Story