ఏపీలో ఇవాళ 9,544 కేసులు..

by Anukaran |   ( Updated:2020-08-21 07:10:01.0  )
ఏపీలో ఇవాళ 9,544 కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ బీభత్సం కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నా.. కేసుల తీవ్రతలో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. గడచిన 24గంటల్లో కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరింది.

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 87,803 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం 2,44,045 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తాజాగా 91 మంది పాజిటివ్‌ బారిన పడి చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 3,092కు చేరింది.

Advertisement

Next Story