సీఎం జగన్ చెప్పినట్లు చేస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదా?

by srinivas |
సీఎం జగన్ చెప్పినట్లు చేస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదా?
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారు. ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ప్రధానిని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని లేఖలో పేర్కొన్నారు. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా 20వేలమంది, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి పొందుతున్నారని, ప్రజల పోరాట ఫలితంగానే వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ప్లాంట్ పరిధిలో రూ. లక్షకోట్ల విలువైన 19,700 ఎకరాలున్నాయి. ఉత్పత్తి ఖర్చు పెరగడం వల్లే ప్లాంటుకు కష్టాలు వచ్చాయి. స్టీల్ ఫ్లాంటుకు సొంతంగా గనులు లేకపోవడం వల్లే నష్టాలు వాటిల్లుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ లో ప్లాంట్‌కు రూ.200కోట్ల లాభం వచ్చింది. వచ్చే రెండేళ్లు ఇదే పరిస్థితుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్యాంకు రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మారిస్తే ఊరట కలుగుతుందని, కాబట్టి కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని సీఎం జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed