బాలికలకు ఉచిత న్యాప్ కీన్స్ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగన్

by srinivas |
ys jagan spe
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ను పంపిణీ చేసే పథకాన్ని జగన్ ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్‌కిన్స్‌ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది.

దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగుతుందని సర్వేలు తెలిపాయి. దీంతో జగన్ సర్కార్ బాలికల విద్యకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి నెలకు 10 చొప్పున సంవత్సరానికి 120 ప్యాడ్స్‌ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు కేటాయించింది.

తక్కువ ధరతో న్యాప్ కీన్స్ సరఫరా:
మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్ఆర్ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్‌కిన్‌లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందు కోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్‌ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్‌కిన్లు లబ్ధిదారులకు ఎల్‌–1 రేటు కంటే 15% మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెప్తున్నారు. గ్రామాల్లో వైఎస్ఆర్ చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నసంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed