- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ కరోనా : జగన్
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజూ 30వేలకు చేరువలో కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. ఈ విస్తృత వ్యాప్తి మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోయాయి. ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు పెండింగ్‌లో పడ్డాయి. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రోజుకో కొత్త సంక్షేమ పథకం ప్రారంభిస్తూ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవల ఏపీలో వెయ్యికి పైగా అంబులెన్సులను ప్రారంభించి, విమర్శకుల చేత ప్రశంసలు పొందారు. అంతేగాకుండా కరోనాపై కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతున్నట్టు ప్రకటించడం అందరికీ తెలిసిందే. కాగా ఏపీలో కేసులు వేగంగా పెరుగుతుండటంతో మరోసారి కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందు ముందు రాష్ట్రంలో కరోనా అందరికీ సోకుతుందని, కరోనా సోకని వ్యక్తంటూ ఉండకపోవచ్చని జగన్ అన్నారు. కరోనా సోకినా ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంటివద్దే కోలుకోవచ్చని చెప్పారు. పొరుగున ఉన్న రాష్ట్రాలు సరిహద్దులను తెరిచి ఉంచాయని, ఎవరి రాకపోకలనూ మనం కట్టడి చేయలేమని, ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పారు.