- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రాజధాని ఎవరిది?
మార్చి నెలలో మూడు పరీక్షలున్నాయి. ఒకవైపు పదో తరగతి పబ్లిక్‌కి విద్యార్థులంతా సిద్ధమవుతుంటే.. మరోవైపు ఉత్తమ భవిష్యత్ కోసం ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం గ్రేటర్ విశాఖ రాజకీయనాయకులు కూడా పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఫెయిలైతే మరో ఐదేళ్లకు గానీ పరీక్షలు రాని నేపథ్యంలో నేతలంతా అస్త్రశస్త్రాలకు పదునుపెట్టుకుంటున్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే నెల ముహూర్తం నిర్ణయించారు. దీంతో వైజాగ్‌లో రాజకీయ నాయకుల హడావుడి మొదలైంది. ఒకరకంగా వైజాగ్‌లో జనవరి నుంచే ఎన్నికల కోలాహలం మొదలైంది. ఛోటామోటా నాయకులంతా వార్డులు, ఆసుపత్రులు, పేదలుండే పేటల్లో సందడి చేస్తున్నారు. చిన్న పనికి, పెద్ద పనికి కల్పించుకుని మరీ అక్కడి వీధుల్లో హడావుడి చేస్తున్నారు. ఓ మోస్తరు నేతలంతా యువ సంఘాలను ఏర్పాటు చేసుకుని మరీ చేతనైనన్ని వితరణ కార్యక్రమాలు చేస్తున్నారు.
బొత్స ప్రకటనతో నేతల్లో కదలిక వచ్చింది. రాజకీయ గురువుల వద్దకు సీటు కోసం పరుగులు పెడుతున్నారు. కార్పొరేటర్‌గా పోటీలో నిలపాలని నేతలను వేడుకుంటున్నారు. వైజాగ్‌ను 98 వార్డులుగా విభజించింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా పూర్తి చేసింది. దీంతో ఆయా వార్డుల్లో లీడర్ల అనుచరులుగా పేరొందిన వారు తెల్లచొక్కాలతో సందడి చేస్తున్నారు.
వైజాగ్‌లో టీడీపీ పాగా వేసింది. మెజారిటీ ఎమ్మెల్యేలను వైజాగ్ వాసులు టీడీపీకి కట్టబెట్టారు. దీంతో వైజాగ్ పీఠంపై పట్టుసాధించాలని టీడీపీ భావిస్తోంది. రాజధానిగా ప్రకటించిన వైజాగ్‌లో ఎలాగూ పట్టు తమదే కనుక మేయర్ పీఠాన్ని కూడా తమ పార్టీకి చెందిన నేతే దక్కించుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. వైజాగ్‌ను దక్కించుకుంటే అధికార పార్టీని ఇబ్బందిపెట్టవచ్చని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది.
అధికార పార్టీగా వైజాగ్‌పై పట్టుసాధించాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. 2014లో వైఎస్ విజయమ్మను ఓడించిన వైజాగ్ వాసులు 2019లో కూడా ఆ పార్టీపై విశ్వాసముంచలేదు. అయినప్పటికీ రాజధానికయ్యే అన్ని అనుకూలతలు ఉండడంతో వైజాగ్‌ను రాజధానిగా జగన్ ప్రకటించారు. దీనికి కృతజ్ఞతగా అయినా వైజాగ్ మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీకి కట్టబెట్టాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
ఆర్థికంగా, పారిశ్రామికంగా బలోపేతమవుతున్న వైజాగ్‌లో పాగావేయడం ఆ రెండు పార్టీలకి కీలకం. దీంతో వైజాగ్‌ను దక్కించుకునేందుకు రెండు పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే వైజాగ్ పట్టునిలుపుకుంటుందా? వైఎస్సార్సీపీ పాగా వేస్తుందా? అన్నది నెల రోజుల్లో తేలిపోనుంది.