- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు : సోము వీర్రాజు
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలకు ఉభయ గోదావరి జిల్లాల్లో పలు గ్రామాలు ముంపునకు గురైయ్యాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ పర్యటించారు. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరద బాధితుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.5వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. ఈ సారైనా బాధిత కుటుంబాలకు రూ.5 వేల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ మంగళవారం ప్రకటించడం తెలిసిందే. అయితే, ఈ పరిహారాన్ని రూ.5 వేలకు పెంచాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద పరిస్థితులపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరద క్రమంగా తగ్గుతోందని.. మరో 10 రోజుల్లో పంటనష్టం అంచనా వేసి పంపించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా, సహాయక చర్యల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని జగన్ పిలుపునిచ్చారు.