- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anandayya Corona Medicine : ఆనందయ్య మందు పంపిణీ ఎప్పుడో చెప్పిన.. ఆయుష్ కమిషనర్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై సీఎం జగన్‌కు వివరాలు అందిచినట్టుగా ఆయుష్ కమిషనర్ తెలిపారు. సోమవారం ఆనందయ్య మందుపై మీడియా ముందు మాట్లాడుతూ.. ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని, ఆనందయ్య మందుపై మూడు, నాలుగురోజుల్లో తుది నివేదిక వెల్లడించనున్నట్టు తెలిపారు. అదే విధంగా ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని పూర్తి నివేదిక వచ్చాకే ప్రజలకు మందు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఆనందయ్య ఔషధంలో వాడుతున్న మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని తెలిపారు. ఇందులో హానికరమైన పదార్థాలేవీ లేవని పేర్కొన్నారు. అలానే ఆనందయ్య మందుతో చాలా మంది కరోనా నుంచి కోలుకున్నట్టుగా తెలిపారు. దీన్ని చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు.