పరిషత్ ఎన్నికలు రద్దు దురదృష్టకరం : సజ్జల

by srinivas |
పరిషత్ ఎన్నికలు రద్దు దురదృష్టకరం  : సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన పరిషత్ ఎన్నిలకలను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ కోర్టు తీర్పు చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాక్షేత్రంలో గెలవలేకనే ప్రతిపక్ష టీడీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని ఆరోపించారు. గతంలో డివిజన్ బెంచ్ తీర్పుతోనే ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అయితే, పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పు వెలువడితే కొందరు నేతలు సంతోషిస్తున్నారంటే వారిని ఏమనుకోవాలని మండిపడ్డారు. ఏ ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారో అందరికీ తెలుసునని అన్నారు. ఓ యజ్ఞంలా పరిషత్ ఎన్నికలు పూర్తిచేశామని వివరించారు. ఇక ఎంపీ రఘురామ కేసు విషయంలో సీఐడీ దాఖలు చేసిన చార్జీషీట్ విషయంలో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.మీడియా ముఖంగా నర్సాపురం ఎంపీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలసునని, ఆయన్ను అడ్డం పెట్టుకుని టీడీపీ డ్రామాలు ఆడిందని సజ్జల విమర్శించారు. ఎంపీకి రమేష్ ఆస్పత్రిలోనే ఎందుకు పరీక్షలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి మీద నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed