- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో 9.4 శాతం వేతన పెంపునకు సిద్ధమవుతున్న ఆ కంపెనీలు..
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి అనంతరం దేశీయ జాబ్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో పరిస్థితులు కుదుటపడుతుండటంతో దేశీయ కంపెనీలు వేతనాల పెంపు పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ ఇండియా తాజా సర్వే కంపెనీల వేతన పెంపు విషయమై కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ దేశీయ కమంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది 8.8 శాతం వేతనాల పెంపును అందించనట్టు అయాన్ ఇండియా తన 26వ వార్షిక సర్వేలో పేర్కొంది. అంతేకాకుండా 2022లో వేతనాల పెంపు 9.4 శాతం ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇటీవల కరోనా సంక్షోభ పరిణామాల నుంచి కంపెనీలు నెమ్మదిగా కోలుకుంటున్నాయి.
దీంతో వచ్చే ఏడాది వ్యాపారాలు మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. అయాన్ ఇండియా సర్వేలో పాల్గొన్న మొత్తం కంపెనీల్లో 98.9 శాతం వేతనాలను పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. చాలావరకు కంపెనీలు వచ్చే ఏడాదిలో ఉద్యోగులకు 2019 నాటి స్థాయిలో వేతన్నాల పెంపును అందించాలని భావిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా టెక్, ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు 10 శాతం వరకు పెంచుతామని చెబుతుండగా, ఆతిథ్య, ఇంధన, ఇంజనీరింగ్ రంగాల్లోని కంపెనీలు వేతన పెంపు మాత్రమే అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చని స్పష్టం చేశాయి.