- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొలిక్కిరాని సమస్య.. రెండు రోజులుగా మృతదేహంతో ఆందోళన
దిశ, జమ్మికుంట: భూ తగాదాలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో సొంత తమ్ముడు ఇంటి ఎదుట చేపట్టిన ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గారంపల్లి సాంబశివరావు (60) అనే రైతు శనివారం రాత్రి గ్రామ శివారులోని బోటి(గుట్ట) సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు సాంబశివరావు మృతికి అతని తమ్ముడైన శ్రీకాంత్ కారణమంటూ మృతదేహాన్ని ఆదివారం ఉదయం నుండి శ్రీకాంత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
కాదా ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు గ్రామ పెద్దలతో చర్చలు జరిపినప్పటికీ, కొలిక్కి రాకపోవడంతో సోమవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే మృతదేహం వద్ద సోమవారం మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో జనం ఉన్న సమయంలో పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, గ్రామ దేవాలయంలోని మైక్ ద్వారా విషయాన్ని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మృతదేహం వద్దకు చేరుకోవడంతో చేసేదేమీలేక పోలీసులు వెనుదిరిగారు.