టైమ్స్ ఆఫ్ ఇండియాపై అనసూయ ఫైర్.. ట్రోల్స్

by Shyam |
టైమ్స్ ఆఫ్ ఇండియాపై అనసూయ ఫైర్.. ట్రోల్స్
X

టైమ్స్ ఆఫ్ ఇండియాపై జబర్దస్త్ అనసూయ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. విలువల్లేని జర్నలిస్టులు, మాపై బతికే వాళ్లు అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాను ఎగతాళి చేసింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే… మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ అంటూ గత వారం టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక లిస్టును విడుదల చేసింది.

ఈ లిస్టులో నెంబర్ వన్ స్థానాన్ని శ్రీముఖి సొంతం చేసుకుందని ప్రకటించింది. నెంబర్ టూగా వింధ్య విశాఖ, మూడో స్థానంలో అదిరింది సమీర, నాలుగులో వర్షిణి, ఐదులో రష్మి, ఆరులో విష్ణుప్రియ, ఇక అనుసూయ 14వ స్థానంలో నిలిచిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అంతే అనసూయకి చిర్రెత్తుకొచ్చింది.. నన్నే 14వ స్థానంలో నిలబెడతారా? అంటూ ఫేస్ బుక్‌లో లైవ్‌కి వచ్చి దుమ్మెత్తిపోసింది. సైడ్ యాంకర్లతో తనను పోలుస్తారా? చాలా కష్టపడి పైకి వచ్చిన తాను వాళ్లతో పోటీ పడాలా? అంటూ మండిపడింది.

అన్ని విధుల్లో విలువలు దిగజారిపోయాయి అన్న అనసూయ, కొన్ని పత్రికలు, టీవీలు ఇంకా దిగజారిపోయాయని ఎద్దేవా చేసింది. తమలాంటి సెలబ్రిటీల మీద పడి బతుకుతాయంటూ మీడియా సంస్థలపై విమర్శలు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కొంత మంది నెటిజన్లు అనసూయను… నువ్వెక్కడ్నుంచి సెలబ్రిటీ వయ్యావు?.. ఆ మీడియా హౌస్‌లో పని చేయకుండానే ఈ స్థాయికొచ్చేశావా? ఇంతకీ అంత కష్టపడి నువ్వు చేసిన పనేంటి? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story