యమధర్మరాజు.. మూర్ఖుల కోసం మళ్లీ పంపాడు : అనురాగ్ కశ్యప్

by Jakkula Samataha |
యమధర్మరాజు.. మూర్ఖుల కోసం మళ్లీ పంపాడు : అనురాగ్ కశ్యప్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ చనిపోయాడని ఓ వెబ్‌సైట్ తన ట్విట్టర్ హ్యాండిల్‌‌లో పోస్ట్ చేసింది. ఆయన గొప్ప స్టోరీ టెల్లర్ అని, చాలా మిస్ అవుతామని సంతాపం కూడా ప్రకటించింది. దీంతో కొందరు నెటిజన్లు సైతం అనురాగ్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దీనిపై స్పందించిన అనురాగ్ కశ్యప్.. ‘నిన్ననే యమధర్మరాజు దర్శనం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఆయనే తనకు తానుగా నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఆయన ఏం చెప్పారంటే నువ్వు ఇంకా సినిమాలు చేయాల్సి ఉంది. లేకపోతే మూర్ఖులు ( భక్తులు) వాటిని బహిష్కరించలేరు కదా.. అప్పుడు వారి జీవితం సార్థకత కాదు కదా.. వారి జీవితం సార్థకం కావాలనే నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నా’ అన్నాడని ఈ న్యూస్ స్ప్రెడ్ చేసిన వారికి చురకలు అంటించాడు.

కాగా, రియా చక్రవర్తికి సపోర్ట్ చేసినందుకే అనురాగ్.. ఇలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. పైగా రియాకు వ్యతిరేకంగా 24 గంటలు వార్తలు ప్రసారం చేస్తున్న ఆర్ణబ్ గోస్వామికి తన పుట్టినరోజున చెప్పు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి చేరుకున్నట్లు పోస్ట్ కూడా పెట్టాడు అనురాగ్.

Advertisement

Next Story