ఇప్పుడే షూటింగ్ అవసరమా? : అనుభవ్

by Shyam |
ఇప్పుడే షూటింగ్ అవసరమా? : అనుభవ్
X

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ కుదేలైంది. షూటింగ్స్ వాయిదా పడ్డాయి. సినిమా విడుదల ఆగిపోయి.. థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సోషల్ డిస్టెన్స్, శానిటైజింగ్, మాస్క్ వినియోగంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించగా.. చిత్రీకరణలు మొదలయ్యాయి.

అయితే షూటింగ్‌కు అనుమతించినా.. సోషల్ డిస్టెన్స్ పాటించడం కష్టమే అంటున్నారు బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా. ఒకవేళ అలా చెప్పినా అబద్దమే అవుతుందన్నారు. ఇప్పుడే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని లేదని.. ఒకవేళ చేసినా ఇంతకు ముందు కంటే 20 శాతం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. సెట్‌లో అందరికీ రక్షణ కల్పించాలంటే డబ్బు ఖర్చవుతుందని.. దానికి బదులు పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ ప్రారంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed