- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఏఏ వ్యతిరేక తీర్మానం..ఓ చిత్తు కాగితం
దిశ, కరీంనగర్ : సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన తీర్మానం చిత్తు కాగితంతో సమానమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్నో పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకుంటున్నముఖ్యమంత్రికి తెలివి లేదన్నారు. కరోనా వ్యాధికి పారాసిటమల్ వేసుకుంటే తగ్గితుంందని అనుకుంటే అంత మంది ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు.సీఏఏ చట్టం తెచ్చి నెలలు గడిచాక దానికి వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక రాజకీయ కోణముందన్నారు. ఇలా చేసినందుకు సీఎం కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. ఒక్కసారి పార్లమెంటులో చట్టం అయ్యాక అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఏం లాభం కలుగుతుందో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టేనని సంజయ్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపి, రాష్ట్రపతి రాజముద్ర పడ్డాక ఆ చట్టాన్ని శాసనసభ కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని, అది తెలియకుండా ఎలా ముఖ్యమంత్రి అయ్యావంటూ నిలదీశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపైన ఏ నిర్ణయం తీసుకోని శాసనసభ, సీఏఏ చట్టం ఏం నిర్ణయం తీసుకోగలుగుతుందో వివరించాలన్నారు. నిజంగా కేసీఆర్ భయంకరమైన హిందువు అయితే ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్న హిందువుల గురించి ఎందుకు స్పందించడం లేదన్నారు.ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ముఖ్యమంత్రి భైంసా అల్లర్లను గల్లీ లొల్లిగా అభివర్ణించడం ఆయనకే చెల్లిందన్నారు. బర్త్ సర్టిఫికెట్ లేదంటున్నసీఎం ఇంతకాలం ఎన్నికల్లో ఎలా పోటీ చేశారో బహిర్గతం చేయాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పేరిట తెలంగాణలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆ సర్వేను ఏ హక్కుతో చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన స్వార్థం కోసం సకల జనుల సర్వే చేస్తే తప్పులేదు కానీ, దేశ భద్రత కోసం ఎన్పీఆర్ తీసుకొస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశంలో విధ్వంసాలకు పాల్పడే టెర్రరిస్టులకు పౌరసత్వం ఇవ్వమంటారా అనే విషయంపై సీఎం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. కేవలం ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టేందుకే సీఎం కేసీఆర్ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారని వ్యాఖ్యానించారు.
Tags: mp bandi sanjay, caa,opp resolution pass by ts govt, bjp state president