చౌటుప్పల్ మండలంలో మరో రెండు కేసులు

by Shyam |
చౌటుప్పల్ మండలంలో మరో రెండు కేసులు
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామంలో ఒకరికి, చిన్నకొండూరు గ్రామపంచాయతీ పరిధిలోని తమ్మలోనిబావిలో మరో కేసు నమోదైనట్లు వైద్యాధికారి శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పీపల్ పహాడ్ కు చెందిన వ్యక్తి టాంజానియా నుంచి రాగా, తమ్మలోనిబావి కి చెందిన వ్యక్తి నైజీరియా నుంచి వచ్చినట్లు సమాచారం. కాగా, ఇటీవల అంకిరెడ్డిగూడెంలో మరణించిన ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న వదంతులు రావడంతో మృతదేహానికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారి శివప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story