టీమిండియాలోకి మరో తెలుగోడు… ఏపీ కుర్రాడికి బంపర్ ఛాన్స్

by Anukaran |
టీమిండియాలోకి మరో తెలుగోడు… ఏపీ కుర్రాడికి బంపర్ ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో క్రికెట్ అంటే ఎంత క్రేజో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వేరే ఆటల కంటే ఈ ఆటనే ఎక్కువమంది చూడటమే కాకుండా ఆడుతుంటారు కూడా. అందుకే చాలా మంది ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మారాలని, ఏనాటికైనా దేశం కోసం ఆడాలని కలలు కంటుంటారు. ఇండియాలో క్రికెటర్లు అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నుంచే వస్తుంటారు. ఎందుకంటే అక్కడ అత్యాధునిక కోచింగ్, సౌకర్యాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రికెట్ ఆడే కుర్రాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వీరిలో జాతీయ జట్టుకు ఎంపిక అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

హైదరాబాద్ వంటి నగరాల్లో పుట్టి పెరిగి క్రికెట్ శిక్షణ తీసుకున్న చాలా మంది క్రికెటర్లకు రాని అవకాశం ఒక చిన్న పట్టణానికి చెందిన కుర్రాడికి వచ్చింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కె. మహబూబ్ బాషా అనే కుర్రాడు ఇండియా అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనపరచడంతో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. డిసెంబర్‌ 7 నుంచి 15 వరకు దుబాయ్ వేదికగా జరుగనున్న టోర్నీలో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇక ఆ టోర్నీలో కూడా మంచి ప్రతిభ కనపరిస్తే మహబూబ్ బాషాకు వరల్డ్ కప్ ఆడే అవకాశం వస్తుంది.

Next Story