మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

by Shyam |
మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం
X

దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి కేటీఆర్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 30న శ్రీలంకలో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగే “కొవిడ్- 19 రిషేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్” సదస్సులో ప్రసంగించాలని నిర్వాహకులు కోరారు. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక విభాగం ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రీ బాడీగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థకు సుమారు వంద దేశాల్లో 45మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలతో పాటు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌, యునెస్కో కార్యనిర్వాహక కార్యదర్శి డా.అర్మిడ సైసియా అల్సాజహబానా, ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ రానిల్ విక్రెమెసింఘె హాజరు కానున్నారు.

Advertisement

Next Story