- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ACB : కేటీఆర్ ఇంట్లో సోదాలకు ఏసీబీకి కోర్టు అనుమతి !
దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Race Case)లో ఏసీబీ, ఈడీ విచారణ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు వరుస షాక్ (Series of Shocks)లు తగులుతున్నాయి. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం..సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోగా అక్కడా తెలంగాణ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేయాలని నిర్ణయించడంతో కేటీఆర్ కు వరుస షాక్ లు ఎదురయ్యాయి.
ఇదే సమయంలో ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ, 16న విచారణకు రావాలని ఈడీలు మరోసారి నోటీసులిచ్చాయి. దీంతో ఫార్ములా ఈ కారు రేస్ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు చేస్తున్న కేటీఆర్ చేస్తు్న్న ప్రయత్నాలకు అన్ని వైపుల చుక్కెదురవుతోంది.
ఇవి చాలదన్నట్లుగా కేటీఆర్ నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారెంట్ కు ఏసీబీ(ACB) కోర్టు అనుమతి(Permission) పొందినట్లుగా సమాచారం. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ చీఫ్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలుపై దర్యాప్తు చేయనున్నారు. హెచ్ఎండీఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు.